క్రైమ్
ప్రియుడి బెయిల్ కోసం ప్రియురాలి సాహసం..
మత్తుకు బానిసైన ఓ యువతి చేసిన సాహసం ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డ్రగ్స్ సరఫరా దందా చేస్తూ ప్రియురాలు పోలీసులకు చిక్కింది. విజయవాడ - పటమటకు చెందిన నాగసౌమ్య, ఆమె ప్రియుడు కాశీవర్ధన్ ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలు అయ్యారు. మూడు నెలల క్రితం చిత్తూరులో డ్రగ్స్ సరఫరా చేస్తూ కాశీవర్ధన్ పోలీసులకు చిక్కాడు. అతన్ని విడిపించేందుకు డబ్బులు లేక, కొందరితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆ కమీషన్ డబ్బులను నాగసౌమ్య కూడబెడుతోంది.ఈ క్రమంలో కృష్ణలంకకు చెందిన బషీర్ రూ.50 వేలు కమీషన్ ఇస్తానని అనడంతో బెంగళూరుకు వెళ్లి 110 గ్రాముల ఎండీఎంఏ తీసుకుంది. బెంగళూరు - హౌరా ఎక్స్‌ప్రెస్‌లో నాగసౌమ్య తిరిగి విజయవాడ రాగా ముందస్తు సమాచారంతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.
