తెలంగాణ
గుంతల వలయం.. ప్రమాదాలకు కేరాఫ్ బడంగ్‌పేట రహదారి!
హైదరాబాద్‌లోని బడంగ్పేట్ మున్సిపాలిటీలో ప్రధాన రోడ్డు అధ్వాన్నంగా మారింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో బీరప్ప కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.రోజుకు రెండు, మూడు ప్రమాదాలు జరుగుతున్నాయని, జీహెచ్ఎంసీకి విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే రోడ్లు వేస్తామని చెప్పడం తప్పా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికుల మండిపడుతున్నారు. రెండు నెలల క్రితం మట్టిని తవ్వించి వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
