స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

PhoneTappingCase: ట్యాపింగ్ కేసులో ఫ్యూ డేస్.. ఎన్ని కావాలి?

ఏ ప్రభుత్వం ఉన్నా ఫోన్ ట్యాపింగ్‌లు జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ పెరిగిన కొద్ది విచ్చలవిడి ప్రయోగాలు చేస్తుంటారు. ప్రశ్నించే వారిపై కత్తి పెడుతుంటారు. అలానే ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేసి గుప్పిట్లో పెట్టుకుంటారు. ఇదంతా అధికార పార్టీకి నష్టం వాటిళ్లుతుందని తెలియగానే చేస్తారు. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా చేసింది. అందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. ఆనాటి పోలీసుల రూపంలో ఉండే దోపిడీ దొంగల వ్యవహారం విచారణలో బయటపడింది. టాస్క్‌ఫోర్స్‌లో రాధాకృష్ణ, కూకట్ పల్లిలో భుజంగరావు, ప్రణిత్ రావు సమాచారంతో ప్రభాకర్ రావు కొడుకు కబ్జాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఫోన్ ట్యాపింగ్‌ను మావోయిస్టుల పేరుతో మిస్ యూజ్ చేసిన వైనం చాలా పెద్దది.