తెలంగాణ

చిల్లర చిచ్చు.. చికిత్స పొందుతూ మహిళ కండక్టర్ మృతి

ఆర్టీసీ బస్సులో చిల్లర పంచాయితీ కాస్త ఓ మహిళ ఉద్యోగి ప్రాణం మీదకు తెచ్చిన విషయం తెలిసిందే.గత వారం కింద చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళా ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఈ ఘటనతో ఆర్టీసీ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల బంద్‌కు పిలుపునిచ్చాయి.వివరాల్లోకివెళితే.. ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ ప్రయాణికురాలితో మహిళ కండక్టర్‌కు చిల్లర వివాదం తలెత్తింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సదరు ప్రయాణికురాలు నెట్టేయడంతో మహిళా కండక్టర్ ప్రవళిక రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో బస్సు వెనుక టైర్లు ఆమె కాళ్ల మీద నుంచి వెళ్లాయి. గత నెల 25న మణుగూరు – భద్రాచలం మార్గంలో అశ్వాపురం మండలం మిట్టగూడెం స్టాప్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.