వైరల్ న్యూస్
దొంగ సాయం.. కళ్ల ముందే యువతికి రూ.1.25 లక్షలు టోకరా
కొందరు ఘరానా దొంగలు రెచ్చిపోతున్నారు.సామాన్యులతో కలిసి పోయి మంచి వారిలా నటిస్తూ జేబులు కొల్లగొడుతున్నారు.రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, బ్యాంకులు, షాపింగ్ మాల్స్‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నారు ఈ దొంగలు.సాయం చేసినట్టు నటిస్తూనే డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే..ఓ దొంగ సాయం చేస్తున్నట్టు నటించి బ్యాంకు వచ్చిన యువతి నుంచి రూ.1.25 లక్షల చోరీకి పాల్పడ్డాడు. హర్యానా రాష్ట్రంలోని జింద్ జిల్లా సఫిదో ప్రాంతంలో ఈ చోటు చేసుకున్నంది. మువానా గ్రామానికి చెందిన పాయల్ అనే యువతి రూ.1.25 లక్షలు డిపాజిట్ చేయడానికి సోదరుడితో కలిసి SBI బ్యాంక్‌కు వెళ్లగా.. ఆమె పక్కనే ఉన్న ఓ దొంగ సహాయం చేస్తున్నట్లు నటించాడు.అనంతరం రూ.1.25 లక్షలు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు.
