తెలంగాణ
తెలంగాణ హక్కులకు మరణశాసనం.. చంద్రబాబు, రేవంత్ పై హరీశ్‌రావు ఆగ్రహం!
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ హక్కులకు మరణ శాసనం రాస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి మద్దతుతో చంద్రబాబు గోదావరి నదిని కబళించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బదులుగా 'పోలవరం' వద్దే చేపట్టాలని కోరుతూ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, దీనికి రేవంత్ రెడ్డి సర్కార్ లోపాయికారి మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు.
