తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. రెండు డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు పెండింగ్ డియర్నెస్ అలవెన్సులను (DA) కలిపి మొత్తం 6.4శాతం చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అక్టోబర్ 1న జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశంలో ఈ డీఏల పెంపునకు అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సర్కార్, కొత్త వేతన సవరణ కమిషన్ (PRC) నివేదికను ఈ నెలాఖరు నాటికి తెప్పించుకుంటామని తెలిపింది.
