తెలంగాణ

నిర్వహణ పేరుతో బాదుడు.. రెట్టింపు కానున్న పార్కుల ఎంట్రీ టికెట్ ధరలు!

 భాగ్యనగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదం కోసం, వ్యాయామం కోసం పార్కులకు వెళ్లే సామాన్యులపై భారం మోపుతూ హైదరాబాద్ నగరంలోని పార్కుల ప్రవేశ (ఎంట్రీ) టికెట్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పార్కుల నిర్వహణ వ్యయం పెరిగిందన్న కారణంతో ప్రభుత్వం ఈ టికెట్ ధరల పెంపును అమల్లోకి తీసుకువస్తుండటంతో నగరవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పటివరకు పెద్దలకు రూ.10గా ఉన్న ఎంట్రీ టికెట్ ధర ఏకంగా రెట్టింపై రూ.20కి చేరుకోనుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు రూ.2గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.5కు పెంచుతూ అధికారులు ఉత్తర్వులు సిద్ధం చేశారు.