తెలంగాణ
దసరా సెలవుల్లో కూల్చివేతలకు బ్రేక్.. తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు!
దసరా పండుగ సెలవుల వేళ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూములు, ఆస్తులపై దసరా సెలవుల సమయంలో ఎలాంటి కూల్చివేతలు గానీ, బలవంతపు చర్యలు గానీ చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, హైడ్రా (HYDRAA) అధికారులకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి ఉన్నత న్యాయస్థానం దిశా నిర్దేశం చేసింది. ఈ ఆంక్షలు అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 25 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
