రాష్ట్రంలో 2.55 లక్షల మంది కొత్త ఓటర్లకు బిగ్ షాక్!
రాష్ట్రంలోని కొత్త ఓటర్లకు బిగ్ షాక్ తగిలింది. కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్న వారిలో చాలా వరకు దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో 2.55 లక్షల మంది కొత్త ఓటర్ల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 10.92 లక్షల ఫామ్-6 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 7,16,436 దరఖాస్తులకు ఆమోదం లభించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఏకంగా 2,55,421 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది.మరో 1,20,963 దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నట్టు సమాచారం. దరఖాస్తు చేసుకున్న ప్రతి పది మందిలో దాదాపు నలుగురికి ఓటు హక్కు ఇంకా ఖరారు కాని పరిస్థితి నెలకొంది. యువతలో ఓటు వేసేందుకు ఆసక్తి పెరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం దరఖాస్తులను తిరస్కరించడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏ కారణాలతో దరఖాస్తులు తిరస్కరించారంటూ యువ ఓటర్ల ప్రశ్నిస్తున్నారు.
