తెలంగాణ
రేవంత్ రెడ్డి వెనుక బినామీ సామ్రాజ్యం
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీల ముసుగులో ముఖ్యమంత్రి చేస్తున్న పెట్టుబడులను వివరిస్తూ ఆయన వెనుక పెద్ద సామ్రాజ్యమే నడుస్తోందని బహిర్గతం చేశారు. 'దుంప శిరీష' అనే మహిళను ముసుగుగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల బినామీ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. మెడికవర్ ఆస్పత్రిలో ప్రధాన షేర్‌హోల్డర్‌గా ఉన్న సదరు మహిళ పేరిట ఉన్న వాటాలను ఏకంగా రూ.13,300 కోట్లకు అమ్మేశారని తెలిపారు. రెండేళ్ల కాలంలో సహృదయ మాతృ సంస్థ ఆదాయం 689 శాతం మేర ఎలా పెరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘మేక్స్ బైన్’ ఫార్మా కంపెనీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణతో పాటు దుంప శిరీష ప్రధాన డైరెక్టర్లుగా ఉన్నారని క్రిశాంక్ వెల్లడించారు.
