సాధువు ముసుగులో మృగం.. ఒంటరి మహిళలకు దగ్గరై!
ఆధ్యాత్మికత అనే ముసుగులో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.అవతలి వ్యక్తుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటున్నారు. పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు.అనంతరం వారికి దగ్గరై లోబరుచుకుంటున్నారు. అంతేకాకుండా వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నా జనాలు ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. . తాజాగా చోటుచేసుకున్న ఘటన ఇలాంటి ఘటనలకు అద్దం పడుతోంది. వివరాల్లోకివెళితే.. ఆధ్యాత్మికత పేరుతో మహిళలకు దగ్గరై.. వందలాది మందిని హిమ్మత్ గిరి అలియాస్ హేమంత్ రాజ్ అనే సాధువు వలలో వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మహిళలతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి వేధించినట్టు తెలిసింది. ముఖ్యంగా వితంతువులు, పిల్లలు లేని మహిళల్ని టార్గెట్ చేసుకొని మాయమాటలతో వారికి దగ్గరై లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం.
