తెలంగాణ
సర్కారుపై పోరుబాట.. రేపటి నుంచే ‘ఈటల’ పాదయాత్ర!
జవహర్ నగర్ డంపింగ్ యార్డును మరొక చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సర్కారుకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా మొద్ద నిద్ర వీడటం లేదని, అందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ పాదయాత్రకు సంబంధించి టైమింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద పాదయాత్ర ప్రారంభం కానుంది.ముందుగా లక్ష్మీనారాయణ చెరువు సందర్శన, ఆ తర్వాత బాధితులతో సమావేశం నిర్వహించనున్నారు.అనంతరం 5 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారు. ఆ తర్వాత మర్రిపల్లిగూడెం గ్రామంలో ఎంపీ ఈటల బృందం పర్యటన కొనసాగనుంది. అక్కడ కూడా బాధితులతో సమావేశం కానున్నారు.
