30-40 ఏళ్ల నినాదం.. సిద్దిపేట జిల్లా కల సాకారం చేసిన కేసీఆర్ : హరీశ్ రావు
సిద్ధిపేట జిల్లాగా ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్థానికంగా ఏర్పాటు చేసిన 10కే రన్లో పాల్గొన్నారు.అంతకుముందు ‘పదేళ్ల సిద్దిపేట జిల్లా పండుగ’ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి 10K రన్‌ను జెండా ఊపి ప్రారంభించగా.. భారీ సంఖ్యలో పాల్గొన్న యువత, క్రీడాకారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లా ‘దశాబ్ది పండుగ’ సంబురాలు వైభవంగా సాగుతాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30-40 ఏళ్ల నాటి ఎన్నికల నినాదం, సిద్దిపేటను జిల్లా చేయాలనే గోడ రాతల కలను కేసీఆర్ నిజం చేశారు. 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లాగా ఏర్పడగా.. 2026 అక్టోబర్ 11తో పదేళ్లు నిండుతున్నాయి. 1983లో ఎన్టీఆర్‌కు అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం ఇచ్చిన కేసీఆర్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అదే చేతితో సంతకం చేసి జిల్లాను ప్రసాదించారు.
