తెలంగాణ
17ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. కూకట్పల్లి వివాదాస్పద ఫ్లాట్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) ఫేజ్-15 పరిధిలో ఇళ్ల కొనుగోలుదారులకు 17ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వివాదంలో ఉన్న 101ఫ్లాట్లను ఈనెల 23వ తేదీలోగా సంబంధిత బాధితుల పేరిట తక్షణమే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ధర్మాసనం సంచలన తుది ఉత్తర్వులు జారీ చేసింది. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం జరిగిందనే కారణంతో కొనుగోలుదారుల నుంచి 14శాతం వడ్డీ వసూలు చేయాలా? వద్దా? అనే ప్రధాన అంశంపై హైకోర్టు తేల్చే వరకు వేచి చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
