తెలంగాణ

‘జీవో 97 రద్దు చేయాల్సిందే..’ ఆగని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు!

జీవో నంబర్ 97 కారణంగా తమ భవిష్యత్తు అంధకారంలో పడుతోందని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయదుర్గం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ ఎదుట సుమారు 200 మంది డిప్లొమా విద్యార్థులు ధర్నాకు దిగారు. SBTET పరిధిలో కొనసాగుతున్న తమ డిప్లొమా కోర్సులను 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' పరిధిలో విలీనం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.