తెలంగాణ

90.. లేదంటే 117 ..దేక్ లేంగే కేసీఆర్

Cm Revanth Vs Kcr: నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాస్కో కేసీఆర్.. ఇదే నా సవాల్ అంటూ ఆవేశంగా మాట్లాడారు. ''ఆనాడు పెద్దలు జానారెడ్డి, జైపాల్ రెడ్డి లాంటోళ్లు ఈ దుర్మార్గులతో మనకెందుకు అనుకున్నారు. కానీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలా అనుకోరు. దెబ్బకు దెబ్బ తీస్తారు. వెనక్కి తగ్గరు. జీవితాంతం గుర్తుంచుకోండి. సీట్లు పెరిగితే 117.. ఉన్న సీట్లే ఉంటే 90 సీట్లతో గెలుస్తాం. 2029లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం కేసీఆర్ ఇదేనా సవాల్'' అని రేవంత్ అన్నారు.