తెలంగాణ

TG : రెండు నెలల్లో 9 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మృతి

జలమండలిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి అత్యంత దారుణంగా తయారైనట్టు తెలుస్తోంది. రెండు నెలల్లో 9 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మృతి చెందడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జలమండలిలో ఉద్యోగుల వరుస మరణాలు సంభవిస్తున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాజాగా మౌలాలి సర్కిల్‌లో మీటర్ రీడర్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మల్లేష్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడం హాట్ టాపిక్ అయ్యింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలను ఆగం చేసేలా ఇటీవల జారీ చేసిన టెండర్ ప్రక్రియపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 675 మంది మీటర్ రీడర్ల కుటుంబాలపై ఈ టెండర్ ప్రక్రియ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.