International

దేశంలో 8.7కోట్ల మంది యువత ఖాళీ.. నీతి ఆయోగ్ సంచలన నివేదిక!

చేతిలో డిగ్రీలు ఉన్నా.. చదువు పూర్తి చేసినా.. యువతకు మాత్రం సరైన ఉపాధి దొరకడం లేదు. దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నీతి ఆయోగ్ తాజా నివేదిక అద్దం పడుతోంది. చదువు, ఉద్యోగం, కనీసం నైపుణ్య శిక్షణ కూడా లేకుండా కోట్లాది మంది యువతీయువకులు ఖాళీగా ఉంటున్న వైనం దేశ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో యువత ఉపాధి, నైపుణ్యాల పరిస్థితిపై నీతి అయోగ్ నివేదికలో ఆందోళనకరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా 15 నుంచి 29ఏళ్ల వయసున్న సుమారు 8.7కోట్ల మంది యువతీయువకులు ప్రస్తుతం ఎలాంటి చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణ లేకుండా ఖాళీగా ఉంటున్నట్లు తేలింది.