ఏపీ

రూ.8,000 కోట్లతో యుద్ధనౌకల తయారీ.. ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి, రక్షణ రంగానికి సంబంధించి ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అత్యాధునిక రక్షణ, యుద్ధనౌకల తయారీ కేంద్రాన్ని (Warship Manufacturing Unit) ఏర్పాటు చేసేందుకు గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) సన్నాహాలు చేస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ. 8,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు గోవా షిప్‌యార్డ్ ముందుకు రాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌కు సోమవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ (SIPC) సమావేశంలో అధికారిక ఆమోదం లభించింది.