వ్యాపారం

స్వీట్ షాపుల్లో ధరల సెగ.. రూ.780కి చేరిన కిలో ధూద్ పేడా!

 దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగలు సమీపిస్తున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండుగ పూట బంధుమిత్రులకు స్వీట్లు పంచి నోరు తీపి చేసుకుందామనుకునే వారికి మిఠాయిల ధరలు విపరీతంగా పెరిగి చుక్కలు చూపిస్తున్నాయి. స్వీట్ల తయారీలో అత్యంత కీలకమైన ప్రధాన ముడిసరుకుల ధరలు మార్కెట్‌లో ఆకాశాన్నంటడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమైంది. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల భారాన్ని తట్టుకునేందుకు వ్యాపారులు స్వీట్ల ధరలను ఏకంగా 30శాతం వరకు పెంచాల్సి వచ్చిందని వెల్లడిస్తున్నారు.