International
75శాతం మంది ఉద్యోగులకు AI భయం.. సంచలన హెచ్చరిక!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల్లో లేఆఫ్ ప్రకటనలతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఈఎంఐల భారంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఏఐ ప్రభావంపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థివేత్త డాలరన్ అసెమోగ్లు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రస్తుతం పయనిస్తున్న విధానంలోనే AI విస్తరణ కొనసాగితే, రాబోయే పదేళ్లలో అక్కడ నిరుద్యోగం ఏకంగా మూడు రెట్లు పెరిగే అవకాశముందని ఆయన హెచ్చరించారు.
