తెలంగాణలో 73 లక్షల ఓట్లు డిలీట్.. ఈసీ అధికారిక ప్రకటన!
ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ రాష్ట్రంలో ఎట్టకేలకు పూర్తయ్యింది. రెండు నెలలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగింది. ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేయడంలో బీఎల్వోలు నిర్లక్ష్యం వహించడం, ఫారమ్స్ అందలేదని పలు ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం రెండు సార్లు గడువు పొడగించగా.. నిన్నటితో తుది గడువు ముగిసింది.అయినప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారమ్స్ చాలా చోట్ల అందలేదని ఓటర్లు, తీసుకున్న వారు వివరాలు సరిగా నింపలేదని బీఎల్వోలు ఆరోపిస్తున్నారు.హైదరాబాద్ మహానగరంలోనూ చాలా చోట్ల ఎన్యూమరేషన్ ఫారమ్స్ తమకు అందలేదని ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి. ఇక ఫారమ్స్ అందుకున్న వారు తిరిగి బీఎల్వోలకు అందజేయలేదని ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలోనే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్టు అధికారిక లెక్కలను ఎన్నికల సంఘం ప్రకటించింది.దీని ప్రకారం రాష్ట్రంలో సుమారు 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు అయ్యాయి.
