ఏపీ
ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్న 72 అడుగుల మట్టి గణపతి!..
విజయవాడలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వినాయకుడి మట్టి విగ్రహం ప్రపంచ రికార్డు సాధించింది. డూండీ గణేశ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని విద్యాధరపురం సితార గ్రౌండ్స్‌లో 72 అడుగుల ఎత్తయిన శ్రీపంచముఖ వరసిద్ధి మహా గణపతి మట్టి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం ఎత్తయిన పర్యావరణ హిత గణేశుడిగా.. ఇంజీనియస్ ఛార్మ్ వరల్డ్ రికార్డ్ (ఐసీడబ్ల్యూఆర్) సాధించింది.
