అమెరికాలో రూ.620 కోట్ల మోసం.. హైదారాబాద్‌లో మకాం!
అమెరికాలోని మెడికేర్ స్కీంలో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. అమెరికా నిఘా వర్గాలు ఈ విషయాన్ని తాజాగా కనిపెట్టగా యూఎస్ సర్కారు నుంచి భారీగా నిధులు దోచేసిన మాస్టర్‌మైండ్ ఓ భారతీయుడిగా అనుమానిస్తున్నారు. నకిలీ బిల్లులు సమర్పించి భారతీయ కరెన్సీలో రూ.వందల కోట్లు స్కామ్ చేసినట్టు సమాచారం. విషయం బయటకు రాకముందే అమెరికా విడిచి ఇండియాకు పారిపోయి వచ్చినట్టు అక్కడి నిఘావర్గాలు గుర్తించినట్టు సమాచారం. అమెరికాలో మెడికేర్ స్కీం ద్వారా అక్కడి పౌరులకు ఉచితంగా వైద్యం అందుతుంటుంది. ఆస్పత్రులకు యూఎస్ గవర్నమెంట్ బిల్లులు చెల్లిస్తుంటుంది.అయితే, రోగులు రాకుండానే, ట్రీట్మెంట్ చేయకుండానే చేసినట్టు నకిలీ బిల్లులు సమర్పించి రూ. వందల కోట్లు కాజేయగా.. దీని వెనుక ఆస్ప్రత్రుల హస్తం ఉందా? అనే కోణంలోనూ అమెరికా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అమెరికాలోని టెక్సాస్‌లో అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్ నిర్వహించిన మహ్మద్ ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి ఈ స్కాంలో సూత్రధారుడిగా ఉన్నట్టు తెలుస్తోంది.
