క్రైమ్

బాలికలు, యువకులే టార్గెట్.. ఫోన్‌లో 600 అసభ్యకర వీడియాలు

మైనర్లను టార్గెట్‌గా చేసుకుని వేధింపులకు గురిచేయడం, లైంగికదాడులకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడుతున్న ఓ దుండగుడిని మహారాష్ట్ర పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ముఖ్యంగా చిన్నారులను మచ్చిక చేసుకోవడం, ఆ తర్వాత అసభ్యకర వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి లైంగికదాడులకు పాల్పడటమే సదరు వ్యక్తి నేర ప్రవృత్తిగా పోలీసులు గుర్తించారు. దీనికి తోడు పలువురు యువకులను సైతం నిందితుడు లైంగికంగా వేధించినట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. చేతన్ ప్రకాశ్ కోలీ (22) మైనర్లను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మహారాష్ట్రలోని నందుర్బార్ పీఎస్ పరిధిలో అరెస్టు చేశారు.