National
శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు, పూర్తి షెడ్యూల్ ఇదే!
మండల, మకరవిళక్కు పూజల నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. నవంబర్ 15, 2026 నుంచి జనవరి 19, 2027 వరకు హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ స్టేషన్ల నుంచి కేరళలోని కొళ్లం మధ్య వివిధ మార్గాల్లో మొత్తం 54ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో (CPRO) ఎ.శ్రీధర్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్ణయంతో అయ్యప్ప మాలధారులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.
