తెలంగాణ
హైదరాబాద్‌లో రూ.52వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు
ప్రజా ప్రభుత్వం పాలనలో హైదరాబాద్ నగరం అభివృద్ధికి రూ.52వేల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నగరంలో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్ లు, అండర్‌పాస్‌లు, తాగునీటి వసతులు, ప్రజా రవాణా వ్యవస్థలు తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులతో పనులు చేపట్టామని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు.
