తెలంగాణ
మారిన నేరాల రూపురేఖలు.. పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన.. 513 మందికి కీలక పోస్టింగ్లు!
రాష్ట్రంలో మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు నక్సలిజం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా, ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలు సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించాయి. ఈ సరికొత్త సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
