తెలంగాణ
ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షలు చాలట్లేదు.. సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే కామెంట్స్!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై భువనగిరి/మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5లక్షల ఆర్థిక సహాయం ఏమాత్రం సరిపోవడం లేదని ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో నిర్మాణ సామగ్రి (సిమెంట్, ఐరన్) ధరలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా మేస్త్రీల కూలీల వ్యయం కూడా ఊహించని విధంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
