ప్రపంచం

ఇండియా సహా 5 దేశాలపై 100 శాతం టారిఫ్! : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచదేశాలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్‌ను భారీగా దిగుమతి చేసుకుంటున్న ఇండియా సహా 5 ప్రధాన దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలను విధించేందుకు సిద్ధమయ్యారు. దానికి వీలు కల్పించే ఆంక్షల బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో తుది ఓటింగ్‌కు సిద్ధం చేశారు. రష్యా,ఇరాన్‌లపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసేలా రూపొందించిన ‘లిండ్సే గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ బిల్లుకు ఇప్పటికే సెనేట్ ఆమోదం తెలపగా.. తాజాగా ప్రతినిధుల సభలో రూల్స్ కమిటీ పరిశీలన తర్వాత తుది ఆమోద ప్రక్రియకు మార్గం సుగమం అయ్యింది. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా.. ఇంధనాన్ని ఎగుమతి చేసి భారీగా నిధులు సమకూర్చుకుంటోంది. రష్యా నుంచి భారత్ భారీగా ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.