National
భారత్‌లో ఇంకా 4G లేని గ్రామాలు.. పరిష్కారంపై ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్!
దేశంలో ఇంటర్నెట్ సదుపాయం సరిగాలేని మారుమూల ప్రాంతాలకు తమ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ 'స్టార్‌లింక్' ఎంతగానో ఉపయోగపడుతుందని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అంతరాన్ని పూడ్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో దేశంలోని ఇంటర్నెట్ నెట్వర్క్ పరిస్థితులపై వచ్చిన ఓ పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
