క్రైమ్

హైదరాబాద్‌లో 49 మంది అక్రమ విదేశీయులు.. భారీగా కేసులు!

హైదరాబాద్ మహానగరంలో ఇటీవల క్రైమ్ రేటు పెద్దఎత్తున పెరుగుతున్న తరుణంలో నగర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.కొందరు విదేశీయులు నగరంలో అక్రమంగా నివాసం ఉంటూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశంతో రంగంలోకి దిగిన పోలీసులు క్రైమ్ రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను పెద్దఎత్తున గుర్తించారు. ఆగస్టు 31 నుంచి నగరవ్యాప్తంగా కొనసాగిన స్పెషల్ ఆపరేషన్ మొత్తంగా 49 మంది అక్రమ విదేశీయులను పోలీసులు గుర్తించారు.వారిలో చాలా మంది వీసా గడువు ముగిసినా తమ దేశాలకు వెళ్లిపోకుండా నగరంలో నివాసం ఉంటున్నట్టు నిర్దారించారు.