తెలంగాణ

పోలవరానికి పోటెత్తిన గోదావరి.. 48 గేట్లు ఎత్తివేత!

గోదావరి నదికి వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు, మూడు రోజులుగా తెలంగాణతో పాటు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద నీరు దిగువకు చేరుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం తీవ్రరూపం దాల్చింది.

పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 30.30 మీటర్లకు చేరుకోగా, స్పిల్‌వే వద్ద 30.20 మీటర్లుగా నమోదైంది. వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు స్పిల్‌వేకు చెందిన మొత్తం 48 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం సుమారు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.