International
చైల్డ్ సెక్సువల్ కంటెంట్.. ‘మెటా’కు రూ.4,700 కోట్ల భారీ జరిమానా?
పిల్లలు, టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించడంతో పాటు వారి భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు ‘మెటా’కు 567 మిలియన్ డాలర్లు అనగా.. భారత కరెన్సీలో సుమారు రూ.4,700 కోట్లకు పైగా భారీ జరిమానా విధిస్తూ ‘న్యూ మెక్సికో’ కోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసు విచారణ రెండు దశల్లో సాగింది. ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్ పిల్లల మానసిక ఆరోగ్యానికి కలిగించే హానికరమైన కంటెంట్‌ను దాచిపెడుతోందని..వినియోగదారులను మోసం చేసిందని నిర్దారణకు వచ్చిన మెక్సికో కోర్టు జ్యూరీ మార్చిలోనే మెటాపై 375 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3,100 కోట్ల జరిమానా విధించింది.
