తెలంగాణ
తెలంగాణలో ప్రమాదంలో 43లక్షల ఓట్లు.. ఈసీ నోటీసులపై ఓటర్ల బేఖాతరు!
తెలంగాణలో భారత ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ఓటర్ల సగ్ర సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఊహించని పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. సవరణ నిమిత్తం ఈసీ జారీ చేసిన నోటీసులకు స్పందించడంలో ఓటర్లు బేఖాతరు చేస్తుండటంతో దాదాపు 43.98 లక్షల మంది(53.62%) ఓట్లు రద్దయ్యే ప్రమాదం నెలకొంది. మొత్తం 82.02లక్షల మందికి నోటీసులు పంపగా, కేవలం 38 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు విచారణకు హాజరయ్యారు. అత్యంత విచిత్రంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో నోటీసులు అందుకున్న 66,342 మంది ఓటర్లలో ఏకంగా 63,984 మంది (96%) విచారణకు గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది.
