తెలంగాణ

స్వాతంత్ర్య దినోత్సవం నాడు పచ్చి అబద్ధాలు, 420 మాటలు..

సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలకు దిగుతూ పచ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. శనివారం సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.