తెలంగాణ
రూ.40.96 కోట్ల పీడీఎస్ రైస్ మాయం.. విజిలెన్స్ తనిఖీల్లో షాకింగ్ నిజాలు
రాష్ట్రంలో మరోసారి భారీ స్కామ్ వెలుగుచూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40.96 కోట్ల ప్రభుత్వ ధాన్యం (పీడీఎస్ రైస్) పక్కదారి పట్టింది. మిల్లింగ్ కోసం అని ప్రభుత్వం రైస్ మిల్లర్‌కు అప్పగించగా..ప్రస్తుతం ఆ ధాన్యం కనిపించకుండా పోయినట్టు తేలింది.ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం సత్తనపల్లిలోని ఏఆర్ఎస్ రైలు మిల్లులో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న సర్కారు.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.దీంతో అధికారులు ఈ నెల 18న సదరు రైస్ మిల్లులో దాడులు నిర్వహించారు. అయితే, విజిలెన్స్ దర్యాప్తులో మరిన్ని అక్రమాలు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల కొరతను గుర్తించారు.
