ఏపీ
3.71 లక్షల పీఎం ఆవాజ్ యోజన ఇళ్లు రద్దు!
ఏపీలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ 1.0 పథకం కింద కేటాయించిన ఇండ్లను కేంద్రం తాజాగా రద్దు చేసింది. 2024 కంటే ముందు మంజూరై ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు ప్రారంభించని దాదాపు 3.71 లక్షల గృహాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పీఎంఏవై అర్బన్ 1.0 పథకం గడువు వాస్తవానికి 2024 డిసెంబర్‌తో ముగిసింది. కానీ, పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించింది. అయినా, నిర్దేశించిన గడువు 2026 జులై నాటికి కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణాలను ఏపీ ప్రభుత్వం చేపట్టకపోవడంతో కేంద్రం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
