National

డిజిటల్‌ మోసాలకు చెక్.. 3700 మొబైల్‌ యాప్స్‌పై కేంద్రం నిషేధం!..

డిజిటల్‌ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్ లోన్ యాప్‌లతో పాటు ప్రజలను మోసం చేస్తున్న అక్రమ అప్లికేషన్లపై ఉక్కుపాదం మోపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఏకంగా 3,718 చట్టవిరుద్ధమైన యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్ సహా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించి బ్లాక్ చేసింది. అధిక వడ్డీల పేరుతో దోపిడీ చేయడం, వ్యక్తిగత డేటాను చోరీ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సైబర్ ముఠాలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.