వ్యాపారం

మొబైల్‌ యూజర్లకు అలర్ట్‌.. 365 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌!..

మొబైల్‌ యూజర్లకు మరోసారి రీఛార్జ్‌ ధరల పెంపు భయం మొదలైంది. టెలికాం కంపెనీలు రానున్న 3 నుంచి 6 నెలల్లో ప్రీపెయిడ్‌ టారిఫ్‌లను 10 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ కొన్ని ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌లను తొలగించగా.. జియో రూ.300తో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. ఈ సభ్యత్వం తీసుకున్న వారికి ఏడాది పాటు టారిఫ్‌ సవరణ నుంచి రక్షణ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీంతో రాబోయే రోజుల్లో రీఛార్జ్‌ ధరలు పెరగవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.