తెలంగాణ

తెలంగాణలో 365 కరువు మండలాలు.. సర్కార్ కీలక నిర్ణయం!

ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో సాగు, తాగు నీటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సాగు, తాగు నీటి ఇబ్బందులు ఏర్పడిన చోట కరువును డిక్లేర్ చేసింది. దీంతో కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరి కరువు ప్రాంతాల్లో అన్నదాతలకు ఆర్థిక సాయం ప్రకటించేందుకు సిద్ధమైంది.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు త్వరగా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో ప్రతిఏటా కురవాల్సిన వర్షపాతం కంటే 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది.