క్రీడలు
ఇషాన్ కిషన్ విధ్వంసం.. ఒకే మ్యాచ్‌లో 350రన్స్ బాది ఆల్‌టైమ్ రికార్డ్!
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన ఇషాన్, ఒకే మ్యాచ్‌లో ఏకంగా 350 పరుగులు చేసి దులీప్ ట్రోఫీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 344బంతుల్లో 270 పరుగుల విద్వాంసకర ఇన్నింగ్స్ ఆడిన ఆయన, రెండో ఇన్నింగ్స్‌లోనూ వేగంగా 98 బంతుల్లో 80 పరుగులు సాధించాడు.
