తెలంగాణ
తెలంగాణలో ఆర్గాన్ స్కామ్.. అత్యంత రహస్యంగా జీవో 33 జారీ?!..
తెలంగాణలో మానవ అవయవ మార్పిడి ప్రక్రియను కార్పొరేట్ ఆస్పత్రుల చేతుల్లో పెడుతూ ప్రభుత్వం అత్యంత రహస్యంగా జీవో 33 జారీ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.. డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ కమిటీ పర్యవేక్షణను పక్కనబెట్టి, ఏడాదికి 25 కంటే ఎక్కువ సర్జరీలు చేసే ప్రైవేటు ఆస్పత్రులకే స్వయంగా అనుమతులు ఇచ్చుకునే ఇన్-హౌస్ సర్వాధికారాలు కట్టబెట్టారు. ఈ రహస్య జీవోతో అవయవ దానంలో రూ.కోట్ల అక్రమ దందాకు దారితీసి, సాధారణ, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందంటూ పౌర సమాజం భగ్గుమంటోంది..
