National
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్.. 31వ జోనల్ కౌన్సిల్ సమావేశం!..
తమిళనాడులోని మహాబలిపురం వేదికగా 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై అధ్యక్షత వహిస్తున్నారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఈ భేటీలో పాల్గొంటున్నారు.
