తెలంగాణ
300 ఎకరాల కబ్జా నిరూపించకపోతే.. సీఎం, మంత్రులు రాజీనామా చేస్తారా?
భూ కబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు హరీశ్ రావు. 300 ఎకరాలు కేసీఆర్ కబ్జాలో ఉన్నాయన్నారు.. దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దామని కోరితే కాంగ్రెస్ నేతలు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు కేసీఆర్ దళితుల భూమిని కబ్జా చేశారని నిరూపిస్తే తామంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ దళితుల భూమిని కేసీఆర్ కబ్జా చేయలేదని తేలితే.. సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారా అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు హరీశ్.
