వ్యాపారం

ఈవీ యజమానులకు హ్యుందాయ్ బంపర్ ఆఫర్: ఒకే యాప్‌లో 30 వేల చార్జింగ్ స్టేషన్లు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) వాడుతున్న వారికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఒక సూపర్ న్యూస్ చెప్పింది. తమ అధికారిక 'మైహ్యుందాయ్' (myHyundai) యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఏకంగా 30,000కు పైగా ఈవీ చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.