National
ఆగస్టు 29 డెడ్లైన్.. డిమాండ్లు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం!..
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు మంగళవారం నాటికి మూడో రోజుకు చేరాయి. ఢిల్లీకి పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతించాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని రైతు సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను ఆగస్టు 29లోగా పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. అవసరమైతే మహా పంచాయత్ నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
