క్రైమ్
వీడిన ప్రిన్సిపాల్ మర్డర్ మిస్టరీ.. 27సార్లు పొడిచి చంపిన పదో తరగతి విద్యార్థులు!
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి(45) దారుణ హత్య కేసు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. జేబీ కాలనీలోని ఆమె నివాసంలో ఈనెల 11వ తేదీ రాత్రి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని పాఠశాల విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలిని ఏకంగా 27సార్లు కత్తితో పొడిచి అత్యంత ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దాదాపు 80మందిని సుదీర్ఘంగా విచారించిన అనంతరం సంచలన విషయాలను గుర్తించారు.
