తెలంగాణ

ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరా రూ.269 కోట్లు

Raidurg Lands: హైదరాబాద్‌ రాయదుర్గం భూములు కాసుల పంట పండిస్తున్నాయి. ఇక్కడి భూములు మరోసారి రికార్డ్ ధరలు పలికాయి. రాయదుర్గంలో తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.269 కోట్లకు అమ్ముడైంది. వారం రోజుల క్రితం (ఈ నెల 21) ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.264 కోట్లు పలకగా.. తాజాగా ఆ రికార్డ్ బద్దలైంది.